Header Banner

రఘురామ టార్చర్ కేసు కొత్త మలుపు! మాజీ CID DIG సునీల్ నాయక్ విచారణలో బయటపడనున్న అసలు నిజాలు ఇవే!

  Mon Mar 03, 2025 10:49        Politics

నరసాపురం మాజీ ఎంపీ, ప్రస్తుత శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజుపై కస్టోడియల్‌ టార్చర్‌ కేసులో అప్పటి సీఐడీ డీఐజీ గా పనిచేసిన సునీల్‌ నాయక్‌కు ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ సోమవారం విచారించనున్నారు. ఈ రోజు విచారణకు రావాలని ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఆయనకు నోటీసు ఇచ్చారు.

 

ఇది కూడా చదవండినామినేటెడ్ పోస్టులపై సీఎం చంద్రబాబు క్లారిటీ!  పదవుల భర్తీకి డెడ్‌లైన్ ఫిక్స్!

 

నరసాపురం మాజీ ఎంపీ (Ex MP), ప్రస్తుత శాసనసభ ఉపసభాపతి (AP Deputy Speaker) రఘురామకృష్ణంరాజు (Raghuramakrishnamraju)పై కస్టోడియల్‌ టార్చర్‌ కేసు (Custodial torture case)లో అప్పటి సీఐడీ డీఐజీ (CID DIG)గా పనిచేసిన సునీల్‌ నాయక్‌ (Sunil Naik)కు ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ (SP Damodar) సోమవారం విచారించనున్నారు. ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని సునీల్ కుమార్‌నకు ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. రఘురామపై కస్టోడియల్ టార్చర్ జరిగిన సమయంలో సునీల్ కుమార్ నాయక్ అక్కడే ఉన్నాడని గుర్తించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ సీఐడీలో డీఐజీగా సునీల్ కుమార్ నాయక్ పని చేశారు. ప్రస్తుతం బిహార్‌లో ఫైర్ సర్వీసెస్ డీఐజీగా ఉన్నారు. మరి... ఆయన విచారణకు వస్తారా, లేదా అన్నది ఉత్కంఠగా మారింది.

 

రఘురామ కృష్ణంరాజును అరెస్టు చేసి సీఐడీ ఆఫీస్‌కు తీసుకొచ్చిన సమయంలో సునీల్‌ నాయక్‌ వచ్చారని ధృవీకరించారు. ఇప్పటికే నమోదు చేసిన వాంగ్మూలాల ఆధారంగా ఆయన పాత్రపైనా విచారించేందుకు రావాలని కోరినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. బిహార్‌ క్యాడర్‌కు చెందిన సునీల్‌ నాయక్‌ను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి తీసుకొచ్చి, సీఐడీ డీఐజీగా పోస్టింగ్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో తనపై కస్టోడియల్‌ టార్చర్‌ జరిగిందని, అందుకు బాధ్యులైన అధికారులు, అప్పటి సీఎం జగన్‌పై రఘురామ గుంటూరు నగరంపాలెం పోలీసులకు గతేడాది ఫిర్యాదు చేసిన విషయం విధితమే.

 

ఇది కూడా చదవండిఏపీ మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు మరో శుభవార్త! ఆది ఏంటో తెలుసా..!

 

గుంటూరు పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఈ కేసులో... గత ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్‌ ఛీఫ్‌గా పనిచేసిన పీఎస్ఆర్ ఆంజనేయులు, సీఐడీ ఛీఫ్‌గా వ్యవహరించిన పీవీ సునీల్‌ కుమార్, మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, సీఐడీ విశ్రాంత అదనపు ఎస్పీ విజయ్‌పాల్, గుంటూరు జీజీహెచ్‌ విశ్రాంత పర్యవేక్షణాధికారి డాక్టర్‌ నీలం ప్రభావతి నిందితులుగా ఉన్నారు. సునీల్‌కుమార్‌కు సన్నిహితుడు.. లీగల్‌ అసిస్టెంట్‌గా వ్యవహరించిన కామేపల్లి తులసిబాబును కూడా పోలీసులు విచారించి.. అరెస్టు చేశారు. ప్రస్తుతం విజయ్‌పాల్‌ కండిషన్‌ బెయిల్‌పై ఉండగా... డాక్టర్‌ ప్రభావతికి అరెస్టు నుంచి న్యాయస్థానం ఊరట కల్పించింది. 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


తాడేపల్లిలో అరుదైన నాలుగు కాళ్ల జీవి కలకలం! భయంతో పరుగులు తీసిన స్థానికులు!


పసిపిల్లల దందా! 9 నెలల్లో 26 శిశువులను విక్రయించిన మహిళా ముఠా! తల్లి ఒడి నుంచి దూరం చేసి...!


టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం! రఘురామ కేసులో కీలక మలుపు! సీఐడీ మాజీ చీఫ్ పై సస్పెన్షన్ వేటు!


పోసాని కేసులో కొత్త మలుపు! అరెస్టు భయంతో హైకోర్టు మెట్లెక్కిన సజ్జల రామకృష్ణారెడ్డి, కుమారుడు!


శ్రీశైలం ఆలయంలో నకిలీ టికెట్ల గుట్టురట్టు! భక్తులకు మరో హెచ్చరిక!


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ! ఉమెన్ ఎంపవ‌ర్‌మెంట్‌ బ్రాండ్ అంబాసిడర్‌గా ఆ హీరోయిన్..


రఘురామ టార్చర్ కేసులో షాకింగ్ ట్విస్ట్! కీలక ఆధారాలు వెలుగులోకి… డీఐజీకి నోటీసులు!


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh#CustodialTorture #Raghuramakrishnamraju #CIDInvestigation #SunilNaik #ShockingCase #PoliticalControversy #JusticeForRaghurama #VijayawadaNews #BreakingNews #APPolitics